
సినిమాలు

తిరుపతి తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు హల్‌చల్ చేసింది. వాహన మండపం సమీపంలో మావటి చంద్రయ్యపై ఏనుగు దాడి చేసి తొక్కేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సిబ్బంది చంద్రయ్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏనుగు దాడితో అక్కడ ఉన్న భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
ఘటన అనంతరం అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ఏనుగులను అదుపులోకి తీసుకుని గజశాలకు తరలించారు. ప్రస్తుతం గాయపడిన మావటి చంద్రయ్యకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనతో ఆలయ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!