
రాజకీయాలు

పంజాబ్లోని మొహాలీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. హెయిర్ మాస్టర్ సెలూన్ సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు బైక్పై వచ్చి కాల్పులు జరిపారు. అకస్మాత్తుగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో సెలూన్ పరిసర ప్రాంతాల్లో కలకలం నెలకొంది. బైక్పై వచ్చిన యువకులు కాల్పులు జరిపిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా, ఇదే హెయిర్ మాస్టర్ సెలూన్ సమీపంలో సెప్టెంబర్ 2న కూడా కాల్పుల ఘటన చోటుచేసుకుంది. తాజాగా మరోసారి అదే ప్రాంతంలో కాల్పులు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో కాల్పులకు గల కారణాలు, నిందితుల వివరాలపై ఆసక్తి నెలకొంది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? కాల్పుల వెనుక కారణమేంటి? అనే విషయాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!