20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు

Writer: Harika S 11:02 AM, 20 ఆగస్టు, 2026
ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు

మెటా మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ ఆర్టురో బెజెర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీ విధానాలపై అమెరికా ఫెడరల్‌ కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. విచారణ రెండో రోజు కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన ఆయన.. 13 ఏళ్లలోపు చిన్నారుల విషయంలో ఇన్‌స్టాగ్రామ్‌ ‘డోంట్‌ ఆస్క్‌.. డోంట్‌ టెల్‌’ విధానాన్ని అనుసరించిందని ఆరోపించారు. అంటే, పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతున్నట్లు తెలిసినా వారి వయసును నిర్ధారించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.

కొత్త టూల్స్‌ అభివృద్ధి సమయంలో భద్రత కంటే యూజర్లు యాప్‌లపై గడిపే సమయం, ఎంగేజ్‌మెంట్‌, లాభాలకే మెటా ప్రాధాన్యం ఇచ్చిందని బెజెర్‌ ఆరోపించారు. 13 ఏళ్లలోపు పిల్లలు పెద్ద సంఖ్యలో ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. ఫేక్‌ ఖాతాలను గుర్తించేందుకు మెటా వద్ద అధునాతన టూల్స్‌ ఉన్నప్పటికీ, వినియోగదారుల వయసును కచ్చితంగా నిర్ధారించేందుకు తగిన వ్యవస్థలు లేవని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను మెటా ఖండించింది.

బెజెర్‌ 2009 నుంచి 2015 వరకు ఫేస్‌బుక్‌లో పనిచేశారు. అనంతరం 2019 నుంచి 2021 వరకు మెటా యాప్స్‌ భద్రతకు సంబంధించిన అంశాలపై కాంట్రాక్టర్‌గా పనిచేశారు. 2023లో అమెరికా కాంగ్రెస్‌ విచారణలోనూ మెటాపై పలు ఆరోపణలు చేశారు. సోషల్‌ మీడియా యాప్స్‌ వల్ల పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న విషయం కంపెనీ ఉన్నతాధికారులకు తెలుసని అప్పట్లో ఆయన పేర్కొన్నారు.

చిన్నారులు, టీనేజర్లు తమ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు బానిసలయ్యేలా మెటా ఉద్దేశపూర్వకంగా వాటిని రూపొందించిందంటూ అమెరికాలోని 29 రాష్ట్రాలు సంయుక్తంగా ఓక్‌లాండ్‌ ఫెడరల్‌ కోర్టులో దావా వేశాయి. యూజర్లు ఎక్కువ సమయం యాప్‌లలో గడిపేలా చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, సంబంధిత వాస్తవాలను దాచడం మెటా వ్యాపార విధానంలో భాగమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ మేగన్‌ ఓనెయిల్‌ ఆరోపించారు. కేసులో మెటాకు ప్రతికూల తీర్పు వస్తే భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా

జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం

భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు

ట్యాగ్లు
మెటాఇన్‌స్టాగ్రామ్‌చైల్డ్‌ సేఫ్టీఆర్టురో బెజెర్‌సోషల్‌ మీడియాఅమెరికా ఫెడరల్‌ కోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారణాసి మ్యూజిక్ ఆల్బమ్‌పై కీరవాణి కీలక అప్‌డేట్
సినిమాలు

వారణాసి మ్యూజిక్ ఆల్బమ్‌పై కీరవాణి కీలక అప్‌డేట్

ఐపీఎల్‌ 2027: హార్దిక్‌ ట్రేడ్‌పై కొత్త ట్విస్ట్‌.. కారణం ఇదే
క్రీడలు

ఐపీఎల్‌ 2027: హార్దిక్‌ ట్రేడ్‌పై కొత్త ట్విస్ట్‌.. కారణం ఇదే

జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా
జనరల్

జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా

సింధు ముందుకు.. లక్ష్యసేన్‌, ఉన్నతి హుడా ఔట్‌
క్రీడలు

సింధు ముందుకు.. లక్ష్యసేన్‌, ఉన్నతి హుడా ఔట్‌

కొకైన్ టెస్ట్‌లో నిక్ కిరియోస్ పాజిటివ్
క్రీడలు

కొకైన్ టెస్ట్‌లో నిక్ కిరియోస్ పాజిటివ్

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?
జనరల్

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?

టీటైమ్ తెలుగు గివ్అవే అలర్ట్: కరెక్ట్‌గా గెస్ చేయండి.. ఇరుముడి టికెట్ గెలుచుకోండి!
సినిమాలు

టీటైమ్ తెలుగు గివ్అవే అలర్ట్: కరెక్ట్‌గా గెస్ చేయండి.. ఇరుముడి టికెట్ గెలుచుకోండి!

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
రాజకీయాలు

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు
జనరల్

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
జనరల్

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!