
జనరల్

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్, ‘గబ్బర్’గా అభిమానుల నుంచి గుర్తింపు పొందిన శిఖర్ ధావన్ తన సతీమణి సోఫీ షైన్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న ధావన్ దంపతులు.. ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన శిఖర్ ధావన్ దంపతులను చూసేందుకు భక్తులు, క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపించారు. ఒకప్పుడు తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ మైదానంలో అభిమానులను అలరించిన ‘గబ్బర్’.. ఇప్పుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తిభావంతో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!