

ఇన్ఫాంట్ న్యూట్రిషన్ ఉత్పత్తులకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై నెస్లే ఇండియాపై భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. NAN Excella Pro Stage 1, Lactogen Pro 1తో పాటు ఒక ఫాలో-అప్ ఫార్ములాను, వాటికి సంబంధించిన ఈ-కామర్స్ ప్రచార సమాచారాన్ని అధికారులు పరిశీలించారు. ఈ వ్యవహారంలో మూడు వేర్వేరు అడ్జుడికేషన్ కేసులు నమోదు చేసినట్లు FSSAI తెలిపింది.
NAN Excella Pro Stage 1 విషయంలో “5 HMOs”, “Whey Protein”కు సంబంధించిన ప్రచార క్లెయిమ్స్‌ను FSSAI పరిశీలించింది. Lactogen Pro 1లోని వెయ్ ప్రోటీన్ సులభంగా జీర్ణమవుతుందనే క్లెయిమ్‌పైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మరోవైపు, నెస్లే తయారు చేసిన ఫాలో-అప్ ఫార్ములా నమూనాను ప్రయోగశాలలో పరీక్షించగా, నిర్దేశిత ప్రమాణాల కంటే బయోటిన్ స్థాయి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం రిఫరల్ ల్యాబొరేటరీలో నిర్వహించిన పరీక్షలోనూ నమూనా నిర్దేశిత బయోటిన్ ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలినట్లు FSSAI పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!