

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ప్రసవానంతరం శరీరంలో వచ్చిన మార్పులపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు. దీనిపై నటి సోనారికా భడోరియా స్పందిస్తూ కత్రినాకు మద్దతు తెలిపారు. తల్లి అయిన తర్వాత మహిళల శరీరంలో సహజంగా వచ్చే మార్పులను ప్రశ్నించడం, బరువుపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రసవం సమయంలో మహిళలు ఎన్నో శారీరక, భావోద్వేగ మార్పులను ఎదుర్కొంటారని, కోలుకునే సమయం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళ ఎలా కనిపిస్తోంది, ఎంత బరువు పెరిగింది అనే విషయాల కంటే.. ప్రసవం, మాతృత్వం సమయంలో ఆమె పడే కష్టాలను అర్థం చేసుకోవడం ముఖ్యమని చెప్పారు.
ఈ సమస్య కత్రినా కైఫ్‌కు మాత్రమే పరిమితం కాదని, తల్లులైన తర్వాత ఎంతోమంది మహిళలు ఇలాంటి ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారని సోనారికా అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వ్యాఖ్యలను పట్టించుకుని మహిళలు తమను తాము తక్కువగా భావించుకోవద్దని సూచించారు. తమ శరీరంపై ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రసవానంతరం మహిళల మానసిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసే సమయంలో మరింత సున్నితంగా వ్యవహరించాలని కోరారు. సోనారికా 2011లో జాదుగాడు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అనంతరం స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం వంటి సినిమాల్లో నటించారు. హిందీలో సినిమాలు, సీరియల్స్‌లోనూ కనిపిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!