
సినిమాలు

యూపీఐ పేమెంట్లపై కొత్త ఛార్జీల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోల్ బంకుల డీలర్లు నగదు చెల్లింపుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ త్వరలోనే బంకుల్లో నగదు చెల్లింపులను ప్రాధాన్యంగా తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపింది. యూపీఐ లావాదేవీల కారణంగా డీలర్లు, వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ అంశంపై ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు వెల్లడించింది. వినియోగదారులతో ఎదురవుతున్న సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. ఇప్పటికే యూపీఐ పేమెంట్లకు సంబంధించిన సమస్యలు, ఛార్జీలపై కేంద్ర మంత్రికి కూడా అసోసియేషన్ లేఖ రాసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీలర్లు యూపీఐ ఛార్జీల నుంచి ఇంధన విక్రయాలను మినహాయించాలని కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!