

దేశవ్యాప్తంగా FASTag వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇకపై వాహనంపై ఉన్న FASTag స్టిక్కర్‌ను మార్చకుండానే.. జారీ చేసే బ్యాంకును మార్చుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ‘OneTag’ పోర్టబిలిటీ సదుపాయాన్ని తీసుకొచ్చింది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా ప్రస్తుతం ఉన్న FASTagనే కొనసాగిస్తూ మరో భాగస్వామ్య బ్యాంకుకు మార్చుకోవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబయిలో ఈ సదుపాయాన్ని ప్రారంభించారు.
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ తరహాలో FASTag బ్యాంకును మార్చుకునేలా ఈ విధానాన్ని రూపొందించారు. వాహన వివరాల ధ్రువీకరణ, ప్రస్తుత బ్యాంకు నుంచి అనుమతి, కొత్త బ్యాంకు ఎంపిక, కస్టమర్ వెరిఫికేషన్, వాలెట్ ఆన్‌బోర్డింగ్ వంటి ప్రక్రియలను యాప్ ద్వారా పూర్తి చేయాలి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సహా పలు బ్యాంకులు ఈ విధానంలో భాగమయ్యాయి. పాత వాలెట్‌కు సంబంధించిన రీఫండ్, ఇతర బాధ్యతలను పాత బ్యాంకే నిర్వహిస్తుంది. దేశంలో 13 కోట్లకు పైగా FASTagలు జారీ కాగా, జాతీయ రహదారులపై 98 శాతానికి పైగా టోల్ వసూళ్లు డిజిటల్‌గా జరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!