

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో నిర్వహించిన శ్రీరామ కథ కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బిహార్‌కు చెందిన ప్రేమ్ కుమార్ సింగ్ భారీగా బంగారు ఆభరణాలు ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజా భయ్యా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆయన ఏకంగా 6.3 కిలోల బంగారు ఆభరణాలతో రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ధరించిన ఆభరణాల విలువ రూ.10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు, సందర్శకుల దృష్టి మొత్తం ఆయనపైనే పడింది.
భారీ బంగారు గొలుసులు, బ్రాస్లెట్లు, ఇతర ఆభరణాలతో మెరిసిపోయిన ప్రేమ్ కుమార్ సింగ్‌ను అందరూ ఆసక్తిగా చూశారు. ఆయనను చూసేందుకు పలువురు చుట్టూ చేరారు. ముఖ్యంగా ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు భక్తులు, సందర్శకులు పోటీపడ్డారు. దీంతో శ్రీరామ కథ కార్యక్రమంలో గోల్డ్ మ్యాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ధరించిన భారీ బంగారు ఆభరణాల గురించి అక్కడికి వచ్చిన వారంతా ఆసక్తిగా చర్చించుకున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!