
జనరల్

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. అర్హులైన పారిశ్రామికవేత్తల దరఖాస్తులను త్వరలోనే పరిశీలించి పారిశ్రామిక రాయితీలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళవారం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సంఘం నాయకుడు పినమాల నాగకుమార్ నేతృత్వంలో పలువురు దళిత పారిశ్రామికవేత్తలు ఆయనను కలిశారు.
పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడంతోపాటు విద్యుత్తు రాయితీలు, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం సహకరించాలని వారు కోరారు. తమ పరిశ్రమలను అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన ప్రభుత్వ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!