

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన నాయకుడిగా కొత్త చరిత్ర సృష్టించిన సందర్భంగా కేంద్ర మంత్రివర్గం అభినందన తీర్మానాన్ని ఆమోదించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి 4,399 రోజుల పాలనతో, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నెలకొల్పిన 4,398 రోజుల రికార్డును అధిగమించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రజాసేవే సుపరిపాలనకు నిజమైన పరీక్ష అని పేర్కొన్నారు. వినయం, అంకితభావం, కర్తవ్యనిష్ఠతో పనిచేసినప్పుడే ప్రజల విశ్వాసం లభిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచంలోని పలు దేశాల నాయకులు కూడా మోదీకి అభినందనలు తెలియజేశారు. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం భారతదేశం ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక రంగాల్లో సాధించిన పురోగతిని ప్రశంసించారు. మోదీ 4,399 రోజుల రాజకీయ ప్రయాణం దేశ అభివృద్ధి, స్వయం సమృద్ధి దిశగా ఒక కీలక ఘట్టమని పలువురు నాయకులు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!