
క్రీడలు

ఆదాయపు పన్ను శాఖ అధికారులు సామాన్యుల ప్రయోజనాల కోసం పనిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రతి చిన్న పనికోసం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని ఆమె హెచ్చరించారు. అధికారులు తమ విధుల్లో నిజాయతీగా, సమర్థవంతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్య వైఖరి పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముంబయిలో ‘ఆయ్‌కార్ సింధు’ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక ప్రభుత్వ సంస్థకే అనుమతుల కోసం ఇబ్బందులు ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని అన్నారు. ప్రజలకు సేవలు ఆలస్యం లేకుండా అందించాలని, నిబంధనలు పాటిస్తూ అధికారులే చొరవ తీసుకోవాలని సూచించారు. సామాన్యులు తమ హక్కులను పొందడానికి కష్టపడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!