
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పలు విమానాలను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)కు దారి మళ్లించారు. అలాగే, శంషాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన స్టార్ ఎయిర్ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. వాతావరణ పరిస్థితులను బట్టి విమాన సర్వీసుల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!