
జనరల్

కోల్‌కతా నుంచి ముంబై వెళ్లేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానంలో హైజాక్ బెదిరింపు కలకలం రేపింది. విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో అందులో హైజాక్ చేస్తామంటూ రాసిన బెదిరింపు లేఖ లభ్యమైంది. దీంతో అప్రమత్తమైన భద్రతా అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విమానంలోని ప్రయాణికులను కిందకు దించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం భద్రతా బలగాలు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ ఘటన నేపథ్యంలో కోల్‌కతా విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బెదిరింపు లేఖకు సంబంధించి అధికారులు విచారణ చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!