
జనరల్

గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 25, 2026న సాధారణ సెలవును ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని నిర్దేశిత ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈ సెలవు వర్తిస్తుంది. భారీగా జరిగే నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు, ట్రాఫిక్, ప్రజల రాకపోకలను నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 25న ప్రకటించిన సెలవుకు బదులుగా నవంబర్ 14, 2026న పనిదినంగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 14 రెండో శనివారం అయినప్పటికీ, ఈ సెలవుకు బదులుగా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు ఆ రోజు పనిచేయాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!