
రాజకీయాలు

రాజస్థాన్లోని కోటా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఓ వాహనం బలంగా ఢీకొట్టడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఖాటు శ్యామ్ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణికులతో వెళ్తున్న వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తీవ్ర ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!