
రాజకీయాలు

హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. డ్రగ్స్ విక్రయాలు, సరఫరాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారంలో పాల్గొనే వారిపై NDPS చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డ్రగ్స్ వ్యాపారులకు సంబంధించిన ఆస్తులను సీజ్ చేయడంతో పాటు, మాదకద్రవ్యాల నిల్వ, విక్రయాలు, సరఫరాకు ఉపయోగించే భవనాలను కూడా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. నేరాలకు పాల్పడే వారికి ఎలాంటి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేస్తూ, హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!