12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..

Writer: Chandrika 06:49 AM, 12 సెప్టెంబర్, 2026
గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..

హైదరాబాద్‌ నగరంలో గణేశ్‌ చవితి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపులను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు, వివిధ ఉత్సవ కమిటీలతో హైదరాబాద్‌ సిటీ పోలీసులు శుక్రవారం విశ్వేశ్వరయ్య భవన్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీపీ వి.సి. సజ్జనర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు సీపీలు ఎ. శ్రీనివాస్‌, తఫ్సీర్‌ ఇక్బాల్‌, జాయింట్‌ సీపీ (ట్రాఫిక్‌) డి. జోయల్‌ డేవిస్‌తో పాటు పలువురు డీసీపీలు పాల్గొన్నారు. గణేశ్‌ ఉత్సవాలకు హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉందని సజ్జనర్‌ తెలిపారు. విగ్రహాల ఆగమనం సందర్భంగా అధిక వేగం, వాహనాలపై డ్యాన్సులు, రద్దీ కారణంగా ప్రమాదాలు, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు ముందుగానే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ట్రాఫిక్‌ తక్కువగా ఉండే సమయాల్లో విగ్రహాలను మండపాలకు తరలించాలని కోరారు. ఊరేగింపు మార్గాల్లో విద్యుత్‌ వైర్లు, చెట్ల కొమ్మలు, రోడ్ల మరమ్మతుల వంటి అడ్డంకులపై జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ శాఖ అధికారులతో సమన్వయం చేశామని, త్వరలో రూట్‌ విజిట్లు నిర్వహిస్తామని తెలిపారు.

ప్రతి గణేశ్‌ మండపం వద్ద నాలుగైదుగురు బాధ్యతాయుతమైన వాలంటీర్లను నియమించి, వారి వివరాలను పోలీస్‌ యాప్‌లో నమోదు చేయాలని సీపీ సూచించారు. వాలంటీర్లకు ఒకే రంగు దుస్తులు లేదా బ్యాడ్జీలు ఇవ్వడం ద్వారా పోలీసులతో సమన్వయం మెరుగుపడుతుందని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా శబ్ద కాలుష్యంపై ప్రజలు, ముఖ్యంగా ఆసుపత్రుల్లోని రోగులు, వృద్ధుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సౌండ్‌ సిస్టమ్స్‌ పరిమితిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన నిమజ్జనం రోజున ఊరేగింపులను ఉదయమే ప్రారంభించేలా నిర్వాహకులను ప్రోత్సహించాలని కోరారు. ఖైరతాబాద్‌ బడా గణేష్‌, బాలాపూర్‌ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీస్‌ స్టేషన్ల వద్ద అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేయడంతోపాటు, అందరి సామూహిక భాగస్వామ్యంతో గణేశ్‌ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా, సురక్షితంగా నిర్వహించాలని పోలీసులు, ఉత్సవ సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?

రాహు-కేతు సంచారం.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు!
ట్యాగ్లు
హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలుగణేశ్‌ చవితిహైదరాబాద్‌ పోలీసులువి.సి. సజ్జనర్‌గణేశ్‌ నిమజ్జనంభాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితిహైదరాబాద్‌ ట్రాఫిక్‌గణేశ్‌ ఊరేగింపుఖైరతాబాద్‌ గణేష్‌బాలాపూర్‌ గణేష్‌

రాహు-కేతు సంచారం.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు!

టోల్‌ప్లాజాలపై గడ్కరీ కీలక అప్‌డేట్.. ఇదే!

టోల్‌ప్లాజాలపై గడ్కరీ కీలక అప్‌డేట్.. ఇదే!

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..
బిజినెస్

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...
సినిమాలు

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ
సినిమాలు

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..
జనరల్

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..
రాజకీయాలు

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..
రాజకీయాలు

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..
జనరల్

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..
బిజినెస్

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!
జనరల్

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?
జనరల్

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!