
జనరల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించారు. నగరంలోని జలవిహార్ గ్రాండ్ లాన్స్‌లో జరిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి నూతన వధూవరులను జగన్ కలిశారు.
నూతన వధూవరులు స్నిగ్ధ, అనంత పినాక్ శర్మలను వైఎస్ జగన్ ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివాహ వేడుకలో పాల్గొని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన ఈ కార్యక్రమం పార్టీ వర్గాల్లోనూ ఆసక్తిని కలిగించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!