

తిరుమలలో ఈ ఏడాది నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుంచి 20 వరకు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన రూ.300 దర్శనం టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. భక్తులు టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో దర్శనాలపై టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేయనున్నారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల దర్శనాలు కూడా నిలిపివేయనున్నారు. ఎన్‌ఆర్‌ఐ, డిఫెన్స్ దర్శనాలు సైతం ఈ కాలంలో రద్దు కానున్నాయి. అక్టోబర్ 10 నుంచి 19 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!