

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ సేవలను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారిక ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల జాబితా నుంచి విశాఖ విమానాశ్రయాన్ని మినహాయించింది. ఈ నిర్ణయంతో విశాఖ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు అందించే ఇమిగ్రేషన్ సేవలు నిలిచిపోనున్నాయి. కేంద్ర హోంశాఖ తాజా ఉత్తర్వులు రాష్ట్ర విమానయాన రంగంలో చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు, భోగాపురం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించారు. దీంతో ఇకపై విదేశాల నుంచి వచ్చే విమానాలు, అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే విమానాల రాకపోకలకు భోగాపురం విమానాశ్రయం కేంద్రంగా మారనుంది. విశాఖ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ సేవల రద్దు, భోగాపురం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం వంటి నిర్ణయాలు ఉత్తరాంధ్ర విమానయాన రంగంలో కీలక మార్పులకు దారితీయనున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!