
సినిమాలు

భారత్, స్విట్జర్లాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు ఐదు కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలతో భారత్–స్విట్జర్లాండ్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత సమున్నత స్థాయికి చేరనున్నాయి. ఆర్థిక, సాంకేతిక, వాణిజ్య సహకారంతో పాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి.
స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాల పురోగతిపై చర్చించడంతో పాటు భవిష్యత్ సహకారంపై నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ఐదు కీలక రంగాల్లో కుదిరిన ఒప్పందాలు ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మరింత ఊతమిస్తాయని భావిస్తున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!