28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

Writer: Nithish 06:32 AM, 28 సెప్టెంబర్, 2026
ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

అధునాతన ఆరోతరం యుద్ధవిమానం అభివృద్ధి దిశగా భారత్‌ కసరత్తు ప్రారంభించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఈ ప్రయత్నంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ పట్టుదలతో వాటిని అధిగమిస్తామని అన్నారు. వచ్చే రెండు దశాబ్దాల్లో మారనున్న యుద్ధరీతులను దృష్టిలో ఉంచుకుని దేశ సైనిక సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అధికారిక విధానంగా కొనసాగిస్తున్నంత కాలం పొరుగు దేశంపై అన్ని రకాల దాడులు చేసే హక్కు భారత్‌కు ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఐదోతరం యుద్ధశకంలో ఉందని వ్యాఖ్యానించారు.

భూమి, సముద్రం, వాయు, సైబర్‌, అంతరిక్షం, మానవ మేధస్సు వంటి రంగాలు యుద్ధ క్షేత్రాలుగా మారుతున్నాయని రాజ్‌నాథ్‌ తెలిపారు. డ్రోన్లు, కృత్రిమ మేధ, క్వాంటమ్‌ సాంకేతికత, హైపర్‌సోనిక్‌ ఆయుధాలు రక్షణ రంగంలో వేగంగా మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. ఆధునిక యుద్ధంలో ఎలక్ట్రానిక్‌, సమాచార యుద్ధ పద్ధతులతో పాటు స్వయంప్రతిపత్తి వ్యవస్థలు, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు కీలకంగా మారాయని వివరించారు. సాంకేతికంగా ముందున్న దేశాలు యుద్ధరంగంలో ఆధిక్యం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఇదిలా ఉండగా, భారత రక్షణ ఎగుమతులు 2013-14లో రూ.686 కోట్ల నుంచి 2025-26లో రికార్డు స్థాయిలో రూ.38,424 కోట్లకు చేరాయి. 2029 నాటికి రూ.50 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు

హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
రాజ్‌నాథ్‌ సింగ్‌ఆరోతరం యుద్ధవిమానంభారత రక్షణ రంగంసైనిక సామర్థ్యాలురక్షణ సాంకేతికతకృత్రిమ మేధడ్రోన్లుహైపర్‌సోనిక్‌ ఆయుధాలురక్షణ ఎగుమతులుభారత సైన్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో దూసుకుపోతున్న మైత్రి సినిమాలు?
సినిమాలు

ఓటీటీలో దూసుకుపోతున్న మైత్రి సినిమాలు?

ది ప్యారడైజ్ కు అసలు పరీక్ష మొదలు?
సినిమాలు

ది ప్యారడైజ్ కు అసలు పరీక్ష మొదలు?

హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు
జనరల్

హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు

హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్
రాజకీయాలు

హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
రాజకీయాలు

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
జనరల్

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు
రాజకీయాలు

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌
జనరల్

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జనరల్

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!