
షోస్

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన తండ్రి, దివంగత దిగ్గజ నటుడు సూపర్‌స్టార్ కృష్ణను ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేశారు. అందులో చిన్నతనంలో ఉన్న మహేశ్‌ను కృష్ణ ఎత్తుకుని కనిపిస్తున్నారు. ఈ ఫొటోకు ‘Always my Superstar’ అంటూ హృదయపూర్వక క్యాప్షన్ జోడించి తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు.
ఈ ఫొటోకు మరో ప్రత్యేకత కూడా ఉంది. మహేశ్ బాబు బాలనటుడిగా పరిచయమైన తొలి చిత్రం ‘పోరాటం’కు సంబంధించినదే ఈ చిత్రం. ఈ సినిమాలో సూపర్‌స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించారు. తాజాగా మహేశ్ పంచుకున్న ఈ పాత జ్ఞాపకం అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. పలువురు అభిమానులు ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కృష్ణను స్మరించుకుంటున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!