

అంతరిక్ష పరిశోధనల్లో నాసా ప్రయోగించిన వోయేజర్-1 మరో చారిత్రక మైలురాయికి చేరువవుతోంది. భూమి నుంచి ఒక లైట్ డే దూరాన్ని చేరుకున్న తొలి మానవ నిర్మిత వస్తువుగా రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. 1977లో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక ప్రస్తుతం భూమికి సుమారు 26 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది. లైట్ డే అంటే కాంతి ఒక రోజులో ప్రయాణించే దూరం. ఈ మైలురాయిని చేరుకోవడం అంతరిక్ష పరిశోధన చరిత్రలో విశేష ఘట్టంగా నిలవనుంది.
ప్రస్తుతం వోయేజర్-1 గంటకు సుమారు 61 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రయాణంలో భూమి నుంచి అత్యంత దూరం వెళ్లిన మానవ నిర్మిత అంతరిక్ష నౌకగా ఇది నిలిచింది. ఒక లైట్ డే దూరాన్ని చేరుకుంటే వోయేజర్-1 మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. సౌరవ్యవస్థకు ఆవల మానవ పరిశోధనలు ఎంత దూరం వెళ్లగలవో ఈ ప్రయాణం చాటిచెబుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!