
క్రీడలు

SAFF ఛాంపియన్‌షిప్ 2026 సెమీఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో బంగ్లాదేశ్ 1-0తో ఓటమి పాలవడంతో ఢాకా స్టేడియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సొంత జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయిన స్థానిక అభిమానులు ఆగ్రహంతో స్టేడియం గ్యాలరీలోని ఓ భాగానికి నిప్పంటించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన ఫైర్ సర్వీస్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో మ్యాచ్ అనంతరం స్టేడియం పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు, ఈ విజయంతో పాకిస్థాన్ తొలిసారిగా SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. నవంబర్ 17న జరగనున్న టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య జరగనున్న ఫైనల్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!