

గుజరాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతి రైల్వే స్టేషన్ నుంచి దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జీ ఆధారిత రైలును కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. ఈ రైలులో డీజిల్–ఎల్‌ఎన్‌జీ డ్యూయల్ ఫ్యూయల్ వ్యవస్థను ఉపయోగించారు. సబర్మతి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ డిపోలోని రెండు 1,400 హెచ్‌పీ డ్రైవింగ్ పవర్ కార్లను ఈ విధానానికి అనుగుణంగా మార్చారు. దీని ద్వారా డీజిల్ వినియోగంలో సుమారు 40 శాతం వరకు ఎల్‌ఎన్‌జీతో భర్తీ చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారత రైల్వేల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, ర్యాపిడ్ రైల్ వ్యవస్థలు, ఆధునిక రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిని ప్రస్తావించారు. 2015–16లో 293 కోట్ల లీటర్లుగా ఉన్న రైల్వేల వార్షిక డీజిల్ వినియోగం 2024–25 నాటికి 108 కోట్ల లీటర్లకు తగ్గిందని, రైల్వే నెట్‌వర్క్‌లో 99.6 శాతం విద్యుదీకరణ పూర్తయిందని ఆయన వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!