

యాపిల్ తాజా ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్ల విక్రయాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. దీంతో కొత్త ఐఫోన్ కోసం కొనుగోలుదారులు యాపిల్ స్టోర్ల వద్ద భారీగా క్యూ కట్టారు. దిల్లీ, ముంబయి, నోయిడా, బెంగళూరు తదితర నగరాల్లో కొందరు స్టోర్లు తెరవకముందే గంటల తరబడి వేచి ఉన్నారు. మరోవైపు బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ సంస్థలు ఎంపిక చేసిన నగరాల్లో కొత్త ఐఫోన్ మోడళ్లను ఇంటికే డెలివరీ చేస్తున్నాయి. లొకేషన్, స్టాక్ ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో సుమారు 10 నిమిషాల్లోనే డెలివరీ అందుతోంది.
బ్లింకిట్‌లో ఐఫోన్ 18 ప్రో నాలుగు రంగుల్లో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 12, ఎయిర్‌పాడ్స్ 5 కూడా అందుబాటులో ఉన్నాయి. దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్, జైపుర్, లఖ్‌నవూ నగరాల్లో ఈ సేవలు అందుతున్నాయి. జెప్టో దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి, బెంగళూరు, చెన్నైలో ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్ 5ను అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై గరిష్ఠంగా రూ.7,000 వరకు డిస్కౌంట్, ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!