
సినిమాలు

పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు కలిసి ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’ పేరిట చారిత్రాత్మక త్రైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఈ మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై దాడి జరిగినట్లయితే, దాన్ని మూడింటిపై జరిగిన దాడిగా పరిగణించి సంయుక్తంగా ప్రతిస్పందించనున్నాయి. ఈ కీలక ఒప్పందం అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక పెద్ద పరిణామంగా భావిస్తున్నారు.
ఈ ఒప్పందం ద్వారా మూడు దేశాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడం, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ అందించడం, అలాగే టెక్నాలజీ మరియు నిఘా సమాచార మార్పిడికి మార్గం సుగమం కానుంది. ముఖ్యంగా ఈ మూడు దేశాల్లో పాకిస్తాన్‌కు మాత్రమే అణ్వాయుధ సామర్థ్యం ఉండటం ఈ ఒప్పందానికి మరింత ప్రాధాన్యతను తెచ్చింది. ప్రాంతీయ భద్రతా సమీకరణాల్లో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషించే అవకాశముంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!