
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ తనకు అభినందనలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానిగా దీర్ఘకాలం సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. పాలనను సేవగా భావిస్తున్నానని, స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల నమ్మకం పెరిగిందని ఆయన అన్నారు.
గత 12 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని తెలిపారు. 7.7 శాతం జీడీపీ వృద్ధి, ఇంటర్నెట్ వినియోగదారులు 25 కోట్ల నుంచి 100 కోట్లకు పెరగడం, డిజిటల్ రంగంలో అభివృద్ధి, మహిళా సాధికారత, ఉగ్రవాదంపై కఠిన చర్యలు, కీలక సంస్కరణలు వంటి మార్పులు జరిగాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!