
రాజకీయాలు

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ బృందానికి చెందిన రైజింగ్ రాజు, దొరబాబు గాయపడ్డారు. వారు కాకినాడ నుంచి భీమవరం వైపు కారులో ప్రయాణిస్తుండగా, పాలకోడేరు సమీపంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
ప్రమాద సమయంలో కారులో ఉన్న రైజింగ్ రాజు, దొరబాబుకు గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వారు ఉభయగోదావరి జిల్లాలకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!