
జనరల్

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లో మంగళవారం రెవెన్యూ శాఖ అధికారులు బుల్డోజర్ యాక్షన్ చేపట్టారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఓ షెడ్డును కూల్చివేశారు. వరద ప్రభావిత ప్రాంతానికి చెందిన ప్రభుత్వ భూమిలో ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ షెడ్డును 2001 పార్లమెంట్ దాడి కేసులో దోషిగా తేలిన మహ్మద్ అఫ్జల్ గురు కుటుంబ సభ్యులు నిర్మించి నివాసంగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినందుకే ఈ చర్య తీసుకున్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. పార్లమెంట్‌పై 2001లో జరిగిన ఉగ్రదాడి కేసులో అఫ్జల్ గురు దోషిగా తేలాడు. అతడికి విధించిన ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించగా, 2013లో శిక్ష అమలు చేశారు. అఫ్జల్ గురుకు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!