10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

Writer: Chandrika 12:59 PM, 10 ఆగస్టు, 2026
ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

ఝార్ఖండ్‌లో జార్ఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (జేపీఎస్సీ) ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై విద్యార్థుల ఆందోళన ఉధృతమైంది. నియామక పరీక్షల్లో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి నేత దేవేంద్రనాథ్‌ మహతో ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు రాంచీకి చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర శాసనసభ ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించి వారిని అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఆందోళనలో భాగంగా ఆరుగురు విద్యార్థుల నిరాహార దీక్ష కొనసాగుతోంది.

జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ ఆరోపణల నేపథ్యంలో కమిషన్‌కు చెందిన ముగ్గురు సభ్యులు ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఆగస్టు 10 నుంచి వారిని సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో 19 మందిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలు జరిపి వారి పలు డిమాండ్లపై సానుకూలంగా స్పందించినప్పటికీ.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న ప్రధాన డిమాండ్‌పై స్పష్టమైన హామీ ఇవ్వలేదని విద్యార్థులు తెలిపారు. దీంతో తమ నిరసనలను కొనసాగిస్తామని ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

ట్యాగ్లు
ఝార్ఖండ్‌ విద్యార్థుల ఆందోళనజేపీఎస్సీ పరీక్షజేపీఎస్సీ పేపర్‌ లీక్‌ఝార్ఖండ్‌ అసెంబ్లీవిద్యార్థుల నిరసననియామక పరీక్షలుపరీక్షల అవకతవకలుఝార్ఖండ్‌ ప్రభుత్వంసీబీఐ దర్యాప్తువిద్యా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు
జనరల్

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయాలు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...
జనరల్

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..
సినిమాలు

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?
గాసిప్స్

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..
క్రీడలు

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్
సినిమాలు

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి
జనరల్

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు
రాజకీయాలు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్
జనరల్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!