6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి

Writer: Nithish 11:25 PM, 5 అక్టోబర్, 2026
హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పి. శ్యామ్‌ కోశి నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన నేపథ్యంలో ఆయన బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత జస్టిస్‌ శ్యామ్‌ కోశి యాక్టింగ్‌ సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 223 ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సెప్టెంబర్‌ 28న జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌తో పాటు మరో ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది.

జస్టిస్‌ పి. శ్యామ్‌ కోశి 1967 ఏప్రిల్‌ 30న జన్మించారు. 1991లో న్యాయవాదిగా నమోదు చేసుకుని మధ్యప్రదేశ్‌, అనంతరం ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో సివిల్‌, రాజ్యాంగ, సర్వీస్‌, కార్మిక చట్టాలకు సంబంధించిన కేసుల్లో ప్రాక్టీస్‌ చేశారు. 2013 సెప్టెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2016లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 జూలై 27న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. మరోవైపు జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ 2025 జూలై 19న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు జస్టిస్‌ సునీతా అగర్వాల్‌, జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌

శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు

ట్యాగ్లు
జస్టిస్ శ్యామ్ కోశితెలంగాణ హైకోర్టుయాక్టింగ్ చీఫ్ జస్టిస్జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్సుప్రీంకోర్టుహైకోర్టు ప్రధాన న్యాయమూర్తికేంద్ర న్యాయశాఖన్యాయవ్యవస్థతెలంగాణ న్యాయస్థానంన్యాయమూర్తుల నియామకం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం
జనరల్

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌
జనరల్

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌

హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి
జనరల్

హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి

‘బ్లడీ రోమియో’లో నాని సరసన హీరోయిన్ ఫిక్స్‌.. ఎవరంటే?
గాసిప్స్

‘బ్లడీ రోమియో’లో నాని సరసన హీరోయిన్ ఫిక్స్‌.. ఎవరంటే?

శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌
జనరల్

శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ
జనరల్

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు
జనరల్

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌
సినిమాలు

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ
సినిమాలు

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!