
రాజకీయాలు

శబరిమల అయ్యప్ప భక్తుల ప్రయాణ సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరువనంతపురం, కొచ్చి విమానాశ్రయాల నుంచి పంబకు నేరుగా ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించింది. విమానాల్లో వచ్చే భక్తులు అక్కడి నుంచి పంబకు సులభంగా చేరుకునేందుకు ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.
భక్తులు తమ విమాన టికెట్లను బుక్ చేసుకునే సమయంలోనే బస్సు సీట్లను కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. దీంతో ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుంది. అదనంగా చార్టర్డ్ బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప భక్తులకు ఈ కొత్త రవాణా సేవలు మరింత సౌకర్యవంతంగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!