
జనరల్

జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్ హతమైనట్లు సమాచారం. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా బలగాలు సంబంధిత ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఆపరేషన్లో లతీఫ్ భట్ హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆపరేషన్లో చోటుచేసుకున్న ఇతర పరిణామాలపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!