
క్రీడలు

కర్నూలును ప్రతిష్ఠాత్మక డ్రోన్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఓర్వకల్ ప్రాంత అభివృద్ధికి కర్నూలు విమానాశ్రయం కీలకమని పేర్కొన్నారు. ప్రాంతీయ పారిశ్రామిక, విమానయాన మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
కర్నూలు, కడప, రాజమండ్రి విమానాశ్రయాలను మరింత అభివృద్ధి చేసి కనెక్టివిటీని మెరుగుపరచనున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానయాన రంగంలో యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఓర్వకల్ డ్రోన్ సిటీని డ్రోన్ల తయారీ, పరిశోధన, పరీక్షలు, ధ్రువీకరణ, శిక్షణ వంటి కార్యకలాపాలకు సమగ్ర కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!