

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాల అనంతరం పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 3.10 లక్షల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కాగా, ఒక్క హుస్సేన్‌సాగర్‌లోనే 66 వేల విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి గణేశ్ విగ్రహాల సంఖ్య 10 శాతం పెరిగింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని ఇతర చెరువుల్లోనూ నిమజ్జనం చేసిన విగ్రహాలను సిబ్బంది తొలగిస్తున్నారు.
మరోవైపు నిమజ్జన మార్గాల్లో పారిశుద్ధ్య పనులను జీహెచ్‌ఎంసీ వేగవంతం చేసింది. హుస్సేన్‌సాగర్ పరిసర రహదారులతో పాటు నిమజ్జన మార్గాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను సిబ్బంది తొలగిస్తున్నారు. గత రెండు రోజుల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది 6 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 13 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!