17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్తీక మాసం పెళ్లిళ్ల సీజన్‌తో ఊపందుకోనున్న స్థానిక వ్యాపారాలు

Writer: Pooja 02:51 PM, 17 నవంబర్, 2026
కార్తీక మాసం పెళ్లిళ్ల సీజన్‌తో ఊపందుకోనున్న స్థానిక వ్యాపారాలు

కార్తీక మాసం ప్రారంభం కావడంతో జగిత్యాల జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. వివాహాలకు సంబంధించిన వస్తువులు, సేవలు అందించే దుకాణాల్లో రద్దీ పెరుగుతోంది. బంగారం ధరలు కొంత తగ్గినప్పటికీ, ఫంక్షన్ హాళ్ల అద్దెల నుంచి నిత్యావసర వస్తువుల వరకు అన్నింటి ధరలు పెరిగాయి. గత నెల రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయినప్పటికీ పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లిళ్లు నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వందలాది జంటలు వివాహ బంధంతో ఒక్కటి కానున్నాయి. దీంతో యువతీ యువకుల తల్లిదండ్రులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ వంటి ప్రధాన పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలు జరగనున్నాయి.

జిల్లాలో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సేవలు, పురోహితులు, భాజా భజంత్రీలు, ఆర్కెస్ట్రాలు, డెకరేషన్ బృందాలు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ప్రీ వెడ్డింగ్ షూట్ స్టూడియోలను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. వివాహాలకు అవసరమైన పట్టువస్త్రాలు, ఇతర దుస్తులు, బంగారు ఆభరణాలను కూడా ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో సుమారు 150 ఫంక్షన్ హాళ్లు, 300 వరకు కమ్యూనిటీ హాళ్లు, పలు దేవాలయాల్లో వివాహ మండపాలు అందుబాటులో ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్‌తో షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, జ్యువెల్లరీ షాపులు, క్యాటరింగ్ కేంద్రాలు, పూల అలంకరణ సంస్థలు, వంట మాస్టర్లకు గిరాకీ పెరగనుంది. ముఖ్యంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో బంగారం, వస్త్ర వ్యాపారాలు ఊపందుకోనున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొత్త డిజైన్లతో కూడిన వస్త్రాలను తెప్పించిన వ్యాపారులు, వినియోగదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, బహుమతులు అందించేందుకు సిద్ధమవుతున్నారు.

కార్తీక, మార్గశిర మాసాల్లో అంటే నవంబరు, డిసెంబరు నెలల్లో వివాహాలు, ఇతర శుభకార్యాలకు అనేక శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. నవంబరు 12 నుంచి 15 వరకు, 18 నుంచి 22 వరకు, 24 నుంచి 26 వరకు వివాహాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నట్లు తెలిపారు. డిసెంబరులో 2 నుంచి 4 వరకు, 10 నుంచి 13 వరకు, 15 నుంచి 19 వరకు, 22, 23 తేదీల్లో, అలాగే 27 నుంచి 31 వరకు శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో జిల్లావ్యాప్తంగా రోజుకు సుమారు రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మళ్లీ అతనికి నో చెప్పిన ఎన్విడియా.. బోర్డు తేల్చేసిందిగా!

మళ్లీ అతనికి నో చెప్పిన ఎన్విడియా.. బోర్డు తేల్చేసిందిగా!

కిమ్ జోంగ్ ఉన్ కుటుంబ పర్యటన ఫొటోలు వైరల్

కిమ్ జోంగ్ ఉన్ కుటుంబ పర్యటన ఫొటోలు వైరల్

ఇన్సూరెన్స్‌ లేకుండా టోల్‌ దాటితే మొబైల్‌కు అలర్ట్‌

ఇన్సూరెన్స్‌ లేకుండా టోల్‌ దాటితే మొబైల్‌కు అలర్ట్‌

ఈనెల హైదరాబాద్‌కు రానున్న టీ-కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జ్ సందీప్

ఈనెల హైదరాబాద్‌కు రానున్న టీ-కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జ్ సందీప్

ఏపీకి ఆర్థికసాయం అందించాలని నిర్మలా సీతారామన్‌ను కోరిన చంద్రబాబు

ఏపీకి ఆర్థికసాయం అందించాలని నిర్మలా సీతారామన్‌ను కోరిన చంద్రబాబు

హైదరాబాద్‌లో గ్లోబల్ కంపెనీ ఎస్‌ఈఐ కొత్త కేంద్రం.. ఉద్యోగ అవకాశాలకు కొత్త వేదిక

హైదరాబాద్‌లో గ్లోబల్ కంపెనీ ఎస్‌ఈఐ కొత్త కేంద్రం.. ఉద్యోగ అవకాశాలకు కొత్త వేదిక

ట్యాగ్లు
పెళ్లిళ్ల సీజన్కార్తీక మాసంజగిత్యాల జిల్లావివాహ షాపింగ్బంగారం ధరలుస్థానిక వ్యాపారాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 72 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 72 ప్రోమో 2 విడుదల

సన్‌రైజర్స్ నుంచి గుజరాత్‌కు మారిన హర్షల్ పటేల్
క్రీడలు

సన్‌రైజర్స్ నుంచి గుజరాత్‌కు మారిన హర్షల్ పటేల్

భారతీయ పరిశోధకులకు ఏడాది పాటు ఉచిత చాట్‌జీపీటీ.. ఓపెన్‌ఏఐ ఆఫర్!
టెక్నాలజీ

భారతీయ పరిశోధకులకు ఏడాది పాటు ఉచిత చాట్‌జీపీటీ.. ఓపెన్‌ఏఐ ఆఫర్!

కార్తీక మాసం పెళ్లిళ్ల సీజన్‌తో ఊపందుకోనున్న స్థానిక వ్యాపారాలు
జనరల్

కార్తీక మాసం పెళ్లిళ్ల సీజన్‌తో ఊపందుకోనున్న స్థానిక వ్యాపారాలు

మళ్లీ అతనికి నో చెప్పిన ఎన్విడియా.. బోర్డు తేల్చేసిందిగా!
జనరల్

మళ్లీ అతనికి నో చెప్పిన ఎన్విడియా.. బోర్డు తేల్చేసిందిగా!

కిమ్ జోంగ్ ఉన్ కుటుంబ పర్యటన ఫొటోలు వైరల్
జనరల్

కిమ్ జోంగ్ ఉన్ కుటుంబ పర్యటన ఫొటోలు వైరల్

ఇన్సూరెన్స్‌ లేకుండా టోల్‌ దాటితే మొబైల్‌కు అలర్ట్‌
జనరల్

ఇన్సూరెన్స్‌ లేకుండా టోల్‌ దాటితే మొబైల్‌కు అలర్ట్‌

ఈనెల హైదరాబాద్‌కు రానున్న టీ-కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జ్ సందీప్
జనరల్

ఈనెల హైదరాబాద్‌కు రానున్న టీ-కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జ్ సందీప్

ఏపీకి ఆర్థికసాయం అందించాలని నిర్మలా సీతారామన్‌ను కోరిన చంద్రబాబు
జనరల్

ఏపీకి ఆర్థికసాయం అందించాలని నిర్మలా సీతారామన్‌ను కోరిన చంద్రబాబు

ఐపీఎల్ 2027కు ముందే సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య భారీ ట్రేడ్ డీల్
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందే సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య భారీ ట్రేడ్ డీల్

‘అదుర్స్ 2’ తీయడంపై సందేహాలున్నాయి.. వీవీ వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘అదుర్స్ 2’ తీయడంపై సందేహాలున్నాయి.. వీవీ వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘రామాయణ’లో సీతను యోధురాలిగా చూపించడంపై విమర్శలు.. స్పందించిన దర్శకుడు
సినిమాలు

‘రామాయణ’లో సీతను యోధురాలిగా చూపించడంపై విమర్శలు.. స్పందించిన దర్శకుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!