

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు ప్రతిపాదనలను అమలు చేసే అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనలను పరిశీలించి, వాటి అమలుకు సహకరించాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. ఏపీలో వరుస తుపానులు, ఎల్‌నినో పరిస్థితుల కారణంగా జరిగిన నష్టాన్ని కూడా ఆయన వివరించారు.
ఎల్‌నినో ప్రభావంతో రైతులు, ఇతర రంగాలు ఎదుర్కొన్న ఇబ్బందులను చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అర్నబ్, మురసు తుపాన్ల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నష్టాన్ని ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థికసాయం అందించాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ సమావేశం అనంతరం చంద్రబాబు ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా నివాసంలో జరిగే శుభకార్యానికి హాజరుకానున్నారు. అనంతరం అదే రోజు రాత్రి అమరావతికి తిరిగి వెళ్లనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!