

భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 25న జరగనున్న మహా నిమజ్జనం సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 20 వేల మంది పోలీసులను భద్రతా విధుల్లో మోహరించగా, 10 వేలకుపైగా సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించి నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో దాదాపు 100 హైరైజ్ కెమెరాలతో పాటు 24 డ్రోన్ల ద్వారా జనసందోహం, శోభాయాత్రను పర్యవేక్షించనున్నారు.
బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు సాగే ప్రధాన శోభాయాత్ర మార్గంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేసేందుకు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి నగరంలోని ప్రధాన ప్రాంతాల మీదుగా సాగే శోభాయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ప్రధాన ఊరేగింపు మార్గంలో సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 10 గంటల వరకు సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!