

అమెరికాకు చెందిన ఓ ఆర్థిక సంస్థలో పనిచేస్తున్న భారతీయ కస్టమర్ సర్వీస్ ఉద్యోగులకు ఊహించని షాక్ ఎదురైనట్లు ఓ ఉద్యోగి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. సుమారు 80 మంది సభ్యులున్న భారత కస్టమర్ సర్వీస్ బృందాన్ని కేవలం ఐదు నిమిషాల గూగుల్ మీట్ కాల్‌లో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు. సాయంత్రం షిఫ్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ఆ రోజు ఆపరేషనల్ కారణాలతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించినట్లు చెప్పారు.
ఉద్యోగి వివరాల ప్రకారం, సాయంత్రం 6.30 గంటలకు షిఫ్ట్ ప్రారంభమైన తర్వాత రాత్రి 9.30 గంటల సమయంలో మొత్తం బృందాన్ని గూగుల్ మీట్‌కు ఆహ్వానించారు. సాధారణ సమావేశమని భావించిన ఉద్యోగులకు భారత కస్టమర్ సర్వీస్ బృందం మొత్తాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. భారత బృందం నుంచి ఆశించిన స్థాయిలో పనితీరు రావడం లేదని సంస్థ తెలిపినట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ వివరాలు ఉద్యోగి సోషల్ మీడియా పోస్ట్‌పై ఆధారపడి ఉన్నాయని, వాటిని స్వతంత్రంగా ధృవీకరించలేదని పలు నివేదికలు స్పష్టం చేశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!