

ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద నగరపాలక సంస్థ అయిన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సత్తాచాటుతోంది. ఆ పార్టీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి.. సమీప ప్రత్యర్థి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరుదు కల్యాణిపై భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు లెక్కించిన 4,36,676 ఓట్లలో శ్రావణికి 2,56,881 ఓట్లు, వరుదు కల్యాణికి 1,37,194 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు 5,434 ఓట్లు, ఇతరులకు 37,163 ఓట్లు లభించాయి.
విశాఖ నగరంలో మొత్తం 120 డివిజన్లు ఉండగా.. పార్టీ వారీగా వెల్లడైన వివరాల ప్రకారం టీడీపీ 27, జనసేన 10, భాజపా 5, వైఎస్సార్‌సీపీ 4 డివిజన్లలో విజయం సాధించాయి. ఇతరులు రెండు డివిజన్లలో గెలుపొందారు. మరో 24 డివిజన్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. దీంతో విశాఖ నగరంలో కూటమి బలమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితాలపై స్పష్టత రానుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!