11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

Writer: Pooja 04:44 PM, 11 సెప్టెంబర్, 2026
ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

అమెరికాలో 9/11 ఉగ్రదాడులు జరిగి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. నాటి దాడుల తర్వాత బాధితుల జీవితాలు శాశ్వతంగా మారిపోయాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక అమాయకులను ఉగ్రవాదం బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు భారత్‌ కట్టుబడి ఉందని, సీమాంతర ఉగ్రవాదానికి భారత్‌ కూడా బాధిత దేశమని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో భారత్‌ దశాబ్దాలుగా పోరాడుతోందని తెలిపారు.

ఉగ్రవాదం కాలానుగుణంగా కొత్త రూపాలను సంతరించుకుంటున్నప్పటికీ, భారత్‌ చెదరని పట్టుదలతో ఈ పోరును కొనసాగిస్తోందని మోదీ అన్నారు. ఉగ్రవాదం అనే పీడను నిర్మూలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 2014లో 9/11 స్మారకాన్ని సందర్శించిన సందర్భంగా తీసిన ఫొటోలను కూడా ఎక్స్‌లో పంచుకున్నారు. 2001 ఈ నెల 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు అమెరికాపై దాడి చేసి, రెండు విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను కూల్చివేశారు. పెంటగాన్‌పై కూడా దాడి చేశారు. ఈ దాడుల్లో 2,977 మంది మరణించారు. ఈ విషాదానికి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా అమెరికా వ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

ట్యాగ్లు
నరేంద్ర మోదీ9/11 ఉగ్రదాడులుఉగ్రవాదంఅమెరికాఉగ్రవాదంపై భారత్ పోరాటం9/11 స్మారకం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు
జనరల్

ప్రోటీన్‌ పౌడర్‌లో పురుగులు.. మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఆశ్రయించిన బిపాసా బసు
సినిమాలు

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...
సినిమాలు

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం
జనరల్

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు
బిజినెస్

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం
జనరల్

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు
జనరల్

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే
జనరల్

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!