
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అహ్మదాబాద్‌లో ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ ప్రెసిడెంట్ (టెక్నికల్ ఆపరేషన్స్) దీపక్ గోండాలియాతో సమావేశమయ్యారు. నక్కపల్లి క్లస్టర్‌లో బయోసిమిలర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఎంక్యూర్‌ను ఆహ్వానించారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్‌లో ఏపీఐ, ఫెర్మెంటేషన్ ఆధారిత బల్క్ డ్రగ్ తయారీ అవకాశాలను పరిశీలించాలని కోరారు.
బయోలాజిక్స్ కోసం ఎంక్యూర్‌కు ఇప్పటికే ఉన్న మైక్రోబియల్ ఫెర్మెంటేషన్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రత్యేకమైన బల్క్ డ్రగ్ తయారీ కేంద్రంగా నక్కపల్లిని అభివృద్ధి చేసే అవకాశం ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కాంప్లెక్స్ ఇంజెక్టబుల్స్, బయోసిమిలర్స్‌పై దృష్టి సారిస్తున్నామని, ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని దీపక్ గోండాలియా తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!