

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు 2026 ఫిఫా ప్రపంచకప్ అధికారిక మ్యాచ్ బాల్ ‘ట్రియొండా’తో చేసిన ప్రయోగాల వీడియోను నాసా విడుదల చేసింది. మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో ఫుట్‌బాల్ కదలికలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
బంతి ద్రవ్యరాశి కేంద్రం, బ్యాలెన్స్ దాని కదలికపై ఎలా ప్రభావం చూపుతాయో ఈ అధ్యయనంలో పరిశీలించారు. 2019లో జరిగిన పరిశోధన ఆధారంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. భూమిపై క్రీడా పరికరాల రూపకల్పనను మెరుగుపరచడానికి ఈ అధ్యయనాలు ఉపయోగపడతాయని నాసా తెలిపింది.
2026 ఫిఫా ప్రపంచకప్ కోసం రూపొందించిన ‘ట్రియొండా’ బంతి కెనడా, మెక్సికో, అమెరికా సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న టోర్నీకి అధికారిక బంతి. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో పాటు మూడు దేశాల గుర్తులను ఇందులో పొందుపరిచారు. ఇందులో ఆధునిక సెన్సర్ టెక్నాలజీ ఉండటంతో రిఫరీలకు కచ్చితమైన సమాచారం అందుతుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!