
జనరల్

అమెరికాలోని న్యూయార్క్ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన ఐకానిక్ ఫ్లాటిరాన్ భవనం కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. 1902లో నిర్మించిన ఈ త్రికోణాకార ఆకాశహర్మ్యం ఇప్పటివరకు కార్యాలయాల కోసం ఉపయోగించగా, ప్రస్తుతం ఆధునికీకరణ చేపట్టి విలాసవంతమైన నివాస ఫ్లాట్లుగా మార్చుతున్నారు. స్టీల్ ఫ్రేమ్ నిర్మాణంతో రూపొందిన ఈ చారిత్రక భవనం న్యూయార్క్‌లోని తొలి తరం ఎత్తైన భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
నగరం నడిబొడ్డున ఉన్న ఈ భవనంలోని ఐదు పడక గదుల లగ్జరీ ఫ్లాట్‌ను బాల్కనీతో కలిపి సుమారు రూ.561 కోట్లకు విక్రయానికి ఉంచారు. న్యూయార్క్ నగరంలో ఈ ధర కంటే ఎక్కువ విలువ కలిగిన నివాసాలు చాలా అరుదుగా ఉన్నాయని సమాచారం. చారిత్రక ప్రాధాన్యత, ఆధునిక సౌకర్యాలు కలగలిపిన ఈ ఫ్లాట్లు సంపన్న వర్గాలను ఆకర్షిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!