
సినిమాలు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పేలుడు ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్లాంట్‌లో భద్రతా నిబంధనలు సక్రమంగా అమలు కాలేదని ఆరోపించాయి. పేలుడు కారణంగా ప్రాణనష్టం, గాయాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు అందించిన నష్టపరిహారం వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని సూచించింది. ఘటనకు దారితీసిన కారణాలు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!