
జనరల్

ఫ్లైదుబాయ్ విమానాన్ని నడుపుతున్న భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై జరిగిన దాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో యాంటీ హైజాకింగ్ చట్టంతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కూడా అభియోగాలను చేర్చింది.
విమానాన్ని హైజాక్ చేయడం లేదా కూల్చివేయడం లక్ష్యంగా పెట్టుకుని కెప్టెన్ మచ్చర్‌పై దాడి చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని ఎన్ఐఏ పేర్కొంది. ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై సంస్థ దర్యాప్తు చేపట్టనుంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!