

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌కు చెందిన కవితా దేవి అలియాస్ కవితా మహతో హోంగార్డ్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు. భర్తను కోల్పోయిన కవితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ బాధ్యతలను ఒంటరిగా మోస్తున్న ఆమె పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. హోంగార్డ్ నియామక ట్రయల్‌లో పాల్గొన్న సమయంలో ఆమె వద్ద రన్నింగ్ షూస్, క్రీడా దుస్తులు కూడా లేవు.
అయినా వెనక్కి తగ్గకుండా చీరకట్టులో, చెప్పులు లేకుండానే 1,600 మీటర్లు పరుగెత్తారు. మహిళలకు నిర్దేశించిన 10 నిమిషాల గడువుకంటే చాలా ముందుగానే, సుమారు ఆరు నిమిషాల్లో పరుగును పూర్తి చేసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఆమె పరుగు వీడియో వైరల్ కావడంతో స్థానిక రన్నింగ్ అకాడమీ సభ్యులు ఆమె పరిస్థితిని తెలుసుకుని ఇంటికి వెళ్లి రన్నింగ్ షూస్, జెర్సీతో పాటు క్రీడా సామగ్రిని అందించారు. కష్టాలను అధిగమిస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చూపిన పట్టుదలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!